

వల్లభనేని వంశీని చూసి నెటిజన్లు షాక్ (VIDEO)
జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 13 నుంచి జైలులో ఉన్న ఆయన తాజాగా బలహీనంగా, తెల్లజుట్టుతో కనిపించారు. తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న వంశీ.. నడవలేక ఇబ్బంది పడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో సమస్యలు, రాత్రి వేళల్లో పల్స్ రేటు తగ్గుతోందని కోర్టులో తెలిపారు. దీంతో ఆయనకు నిన్న వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.