
స్కూల్లో అగ్ని ప్రమాదం.. 17 మంది చిన్నారులు మృతి!
ఆఫ్రికా దేశమైన నైజీరియాలోని ఓ పాఠశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది చిన్నారులు మృతి చెందినట్లు సమాచారం. పలువురికి గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.