నారాయణగూడ లోని ఇండియన్ ధర్భర్ రెస్టారెంట్ లో మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా కుళ్ళిపోయిన టమాటాలు, పచ్చిమిర్చి, క్యారెట్ లను గుర్తించారు. వంటగదిలో బొద్దింకలు ఉన్నాయని, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందుబాటులో లేవన్నారు. సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను సీజ్ చేసినట్లు తెలిపారు.