నల్లకుంట డివిజన్ రత్నానగర్ బస్సులో రూ. 44 లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్థానిక కార్పొరేటర్ అమృతతో కలిసి గురువారం ప్రారంభించారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. బస్తీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కిషోర్ కుమార్, పాదం వెంకటేష్, రాము యాదవ్, వీరయ్య గౌడ్ పాల్గొన్నారు.