నీచమైన మనస్తత్వం, జాతిని తాకట్టు పెట్టి జాతి మీద బతికే మందకృష్ణ లాంటి వాళ్ళకి మాదిగ సమాజం తప్పకుండా బుద్ధి చెబుతుందని మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు పిడమర్తి రవి హెచ్చరించారు. గురువారం ఓయూలో ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఖబడ్దార్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటూ మండిపడ్డారు. ఏనాడూ నువ్వు సీఎంను కలిసి 11% రిజర్వేషన్లు కావాలని అడగలేదని ద్వజమెత్తారు.