రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ చలన చిత్ర పురస్కారాల కార్యక్రమం హైటెక్స్ లో ఘనంగా జరుగుతోంది. పుష్ప-2 సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అవార్డును అల్లు అర్జున్ అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్న అల్లుఅర్జున్. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దిల్ రాజు ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు.