ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు దొచ్చుకెళ్ళిన ఘటన హయత్ నగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ప్రియదర్శిని కాలనీలో నివసించే స్వాతి. తెలిసిన వారు చనిపోతే గురువారం సూర్యాపేటకు వెళ్లింది. సాయంత్రం వచ్చి చూడగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూడగా బిరువలోని 30 తులాల బంగారు ఆభరణాలు కలిపించలేదు. దీంతో పీఎస్ లో పిర్యాదు చేయగా కేసు నమోదైంది.