మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మహిళ తన కుమార్తె (15)తో కలిసి వలస వచ్చి కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటోంది. నేరెడ్మెట్ వినాయకనగర్ కు చెందిన విజయ్ కుమార్ (23)తో బాలికకు పరిచయం ఏర్పడింది. తన స్నేహితులైన బాలు (20), కృష్ణ (21), కిరణ్ (20), అజయ్ (22) లకు పరిచయం చేశాడు. ఐదుగురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో వారి గుట్టు రట్టయింది. మంగళవారం ఐదుగురిపై కేసు నమోదు చేశారు.