కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీ ప్రకటించాలని ఓయు జేఏసీ నాయకుడు, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ అన్నారు. 48 గంటల్లో నిరుద్యోగుల డిమాండ్ ను పరిష్కరించకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తామన్నారు. గ్రూప్ -2, 3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. గ్రూపు -1 పోస్టులను 1100, గ్రూపు -2 లో 2000, గ్రూపు -3 లో 3000 పోస్టులు పెంచాలని, గురుకుల అధ్యాపక నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.