నేడు చైత్ర శుద్ధ పౌర్ణమి. హనుమంతుడు లంకలో సీతామాతను కనుగొని ఆ నగరాన్ని దహనం చేసిన రోజు. ఆ ఘట్టానికి గుర్తుగా ఏటా ఈ తిథిని హనుమాన్ విజయోత్సవం లేదా జయంతిగా జరుపుకొంటారు. ఇక పరాశర సంహిత ప్రకారం. వైశాఖ మాసం బహుళపక్ష దశమి రోజున స్వామివారు జన్మించారు. ఆ తిథిని జన్మోత్సవం/జయంతిగా జరుపుతారు. రెండు సందర్భాల్నీ చాలామంది జయంతిగానే జరపడం వల్ల ఏటా 2సార్లు హనుమజ్జయంతి వస్తుంటుంది.