
రవీంద్ర జడేజా అద్భుత రికార్డ్
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఇంగ్లాండ్‌పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇవాళ ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన జడ్డూ ఓవరాల్‌గా ఇంగ్లాండ్‌పై 41 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అతడి తర్వాత జేమ్స్ అండర్సన్(40), ఆండ్రూ ఫ్లింటాఫ్(37), హర్భజన్ సింగ్(36), జవగళ్ శ్రీనాథ్(35), అశ్విన్ (35) ఉన్నారు.