అనేక అక్రమాలు చోటుచేసుకున్న నీట్ పరీక్షను తక్షణమే రద్దుచేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ నిరాహార దీక్ష చేపట్టారు. శనివారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద ఈ దీక్ష కొనసాగుతోంది. అవకతవకలపై సీబీఐ చే సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ ను తక్షణమే అరెస్టు చేయాలని అన్నారు.