హైదరాబాద్: ఈ నెల 25న వీఆర్వో, వీఆర్ఎలకు పరీక్ష

61చూసినవారు
హైదరాబాద్: ఈ నెల 25న వీఆర్వో, వీఆర్ఎలకు పరీక్ష
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక్క జీపీవో(గ్రామ పాలన ఆఫీసర్) ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే పూర్వపు వీఆర్వో, వీఆర్ఎల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారందరికీ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు వారికి ఈ నెల 25న పరీక్ష పెట్టనున్నారు. కలెక్టర్ల నేతృత్వంలోనే ప్రతి జిల్లాలో పరీక్షను పూర్తి చేయనున్నారు. ఈ పరీక్షలో జీపీవో విధులు, బాధ్యతలపైనే ప్రశ్నలుంటాయని సమాచారం.

సంబంధిత పోస్ట్