బర్త్ డే పార్టీ కేసుపై సింగర్ మంగ్లీ గురువారం స్పందించారు. తన తల్లిదండ్రుల కోరిక మేరకు ఫ్రెండ్స్ పార్టీ ఏర్పాటు చేశాను. లిక్కర్, సౌండ్ సిస్టంకు పర్మిషన్ తీసుకోవాలనే విషయం నాకు తెలియదని, తెలిసుంటే అనుమతి తీసుకునేదాన్ని. పార్టీలో లోకల్ లిక్కర్ తప్ప ఎటువంటి మత్తు పదార్థాలు వాడలేదు. గంజాయి తీసుకున్న వ్యక్తి దానిని మా పార్టీలో తీసుకోలేదు. దయచేసి ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపొద్దు అంటూ సింగర్ మంగ్లీ వేడుకున్నారు.