హైదరాబాద్ లో బీజేపీ చేపట్టిన మూసి నిద్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం అంబర్ పేట్ నియోజకవర్గం గొల్నాకకు చేరుకున్నారు. తులసి రాంనగర్ బస్తీలో పర్యటిస్తూ బాధితులు, స్థానికులతో మాట్లాడారు. మూసి బాధితులకు తాము అండగా ఉంటామని అయన వారికి భరోసా ఇచ్చారు. రాత్రికి బస్తీ వాసులతో కలిసి భోజనం చేయనున్న కిషన్ రెడ్డి, అనంతరం అక్కడే నిద్ర చేయనున్నారు.