ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ పీ. నవీన్ కుమార్ కు ప్రతిష్టాత్మక ఐఈటీఈ జాతీయ అవార్డు దక్కింది. ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ , న్యూఢిల్లీ శ్రీనివాసన్ మెమోరియల్ అవార్డు 2024 ను ప్రొఫెసర్ నవీన్ కుమార్ కు ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌కు ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను ఈ అవార్డు దక్కింది.