కేంద్రమంత్రి ఇంటి వద్ద ఉద్రిక్తత

85చూసినవారు
హైదరాబాద్ బర్కత్ పురాలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై విద్యార్థి సంఘాలు శనివారం ఉదయం ఆందోళనలు చేపట్టాయి. నీట్ ఛైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

సంబంధిత పోస్ట్