జీవో నెంబర్ 29ని రద్దు చేయాలంటూ ఓయూలో నిరసన
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 29ని రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. గురువారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా వాళ్లకు లాభం చేకూర్చే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను తక్షణమే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.