దశలవారీగా డివిజన్ లో అభివృద్ది పనులను చేపడుతున్నామని కిషన్ బాగ్ డివిజన్ కార్పొరేటర్ హుస్సేనీ పాషా అన్నారు. మంగళవారం డివిజన్ పరిధిలోని బాబా నగర్లో రోడ్డు పనులను కార్పొరేటర్ పరిశీలించారు. గడువులోగా పనులను పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడకుండా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు.