బహదూర్ పురా పరిధి బీఎన్కే కాలనీలో విద్యుత్ శాఖ సిబ్బంది చెట్ల కొమ్మలను తొలగించారు. అనంతరం వాటిని అక్కడే వదిలేశారు. విద్యుత్ తీగలకు ప్రమాదకరంగా ఉన్న కొమ్మలను నరికి అక్కడే వదిలేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చెట్ల కొమ్మలు పేరుకుపోయాయని శుక్రవారం స్థానికులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఆఫీస్ సమీపంలోనే ఇలా ఉంటే మిగితా డివిజన్లలో పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.