పెంచిన బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్వర్యంలో మంగళవారం బస్ భవన్ ఎదుట మెరుపు ధర్నా చేపట్టారు. ఆ సంఘం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెంచిన బస్ పాస్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఛార్జీలను పెంచడంతో పేద విద్యార్థులకు భారంగా మారుతుందన్నారు.