'గేమ్ ఛేంజర్' టికెట్ ధరలు ఇలా..!
‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.600 గా నిర్ణయించింది. అలాగే సినిమా విడుదలైన రోజు నుంచి 14 రోజులు పాటు మల్లీప్లెక్స్లో అదనంగా రూ.175, సింగిల్ థియేటర్లలో రూ.135 వరకూ టికెట్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. జనవరి 11 నుంచి 23 తేదీ వరకూ ఇవే ధరలతో ఐదు షోలకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది. జనవరి 24వ తేదీ నుంచి సాధారణ టికెట్ ధరలు అందుబాటులోకి రానున్నాయి.