చాంద్రాయణగుట్ట డివిజన్ పరిధిలోని సన్నీ గార్డెన్ వద్ద కొనసాగుతున్న నాల నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ పహద్ శుక్రవారం పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పనుల పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సన్నీ గార్డెన్ నుంచి గుర్రం చెరువు వరకు ఈ నాల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. త్వరగా పనులను పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి కార్పొరేటర్ సూచించారు