కూకట్ పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కుకట్ పల్లి మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ అధికారులతో సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ముందుగా భరత్ నగర్ నాళా పనులు పరిశీలించి కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాలా పనుల్లో జాప్యం లేకుండా ఇక్కడ కాలనీవాసులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న స్థలంలోనే నాలా విస్తరణ పనులు చేపట్టాలని అన్నారు.