సికింద్రాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన ఎమ్మెల్యే

54చూసినవారు
సికింద్రాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన ఎమ్మెల్యే
హైదరాబాద్ ఇన్ ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ని మంగళవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ కలిశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాల్సిందిగా వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా నిర్మాణంలో ఉన్న కమ్యూనిటి హాల్స్ పూర్తి చేయడం, కొత్తవాటి నిర్మాణం, తాగునీటి సరఫరా కోసం హెడ్ వాటర్ ట్యాంకులు, మహిళా భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. వీటిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్