హైదరాబాద్: వీర జవాన్లకు యాదవ మహాసభ ఘన నివాళి

81చూసినవారు
దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు అఖిల భారత యాదవ మహాసభ తరఫున ఘన నివాళి అర్పించారు. బుధవారం హైదరాబాద్ విద్యానగర్లో తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షుడు గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్ నేతృత్వంలో యువజన నాయకులు కోవతులు వెలిగించి నివాళులర్పించారు. ఆపరేషన్ సింధూర్ లో వీరుల ధైర్యం, త్యాగం స్మరించుకుంటూ, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పలువురు యువనేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్