బహదూర్ పుర: క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తాం.. ఎమ్మెల్సీ
క్షేత్ర స్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రేహ్మత్ బేగ్ అన్నారు. సోమవారం శాస్ట్రిపురం డివిజన్ పరిధిలోని సైఫి కాలనీలో ఎమ్మెల్సీ అధికారులతో కలిసి పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ లైన్ ఓవర్ స్లో సమస్యలు ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్సీకి తెలుపగా వెంటనే సమస్యలను పరిష్కరించాల్సిందిగా అధికారులను ఎమ్మెల్సీ ఆదేశించారు.