హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ భీమోజు ప్రశాంత్ కుమార్ ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండా ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీలోఫర్ వ్యవస్థాపకుడు అనుముల బాబూరావ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని భీమోజు ప్రశాంత్ కుమార్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు. ఈ సందర్భంగా భీమోజు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ "తెలుగు AI బూట్ క్యాంప్ తన సాంకేతిక నైపుణ్యాలను మరింత బలోపేతం చేసిందన్నారు. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా అన్వయించడం ద్వారా తన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సామర్థ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయన్నారు. ఈ శిక్షణ నా కెరీర్‌లో నూతన ఆవిష్కరణలను అమలు చేయడానికి మరియు సాఫ్ట్‌వేర్ రంగంలో సమర్థవంతమైన పరిష్కారాలను అందించడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నానన్నారు. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గుండాకు హృదయపూర్వక ధన్యవాదాలు!" అని తెలిపారు. తరువాతి తెలుగు బూట్ క్యాంప్ జూన్ 1, 2025 నుండి ప్రారంభం కానుంది.