ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ శ్రీ శివాలయం ప్రాంగణంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని పూలమాలలతో, 7 ద్వారాలతో, దేవీ దేవతల ప్రతిమలతో, విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించారు. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చి శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రణమిల్లారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ప్రసాదాన్ని పంచారు.