పాతబస్తీలో నేరాల కట్టడికి చర్యలు : డీసీపీ

58చూసినవారు
పాతబస్తీలో నేరాల కట్టడికి చర్యలు : డీసీపీ
పాతబస్తీలో నేరాల కట్టడానికి తగిన చర్యలు చేపడుతున్నామని డిసిపి స్నేహ మెహ్రా మంగళవారం తెలిపారు. శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన షిమ్లా అనే యువకుడి హత్య కేసులోని 12 మంది నిందితులను అరెస్టు చేశారు. ఇదే కేసుకు లింకుగా ఉన్న కాలా పత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాష అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన ఎనిమిది మందిని కూడా ఈ సందర్భంగా అరెస్టు చేశారు. పాతబస్తీలో రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.
Job Suitcase

Jobs near you