ఏ క్షణంలోనైనా టీపీసీసీ నూతన కార్యవర్గాన్ని అధిష్ఠానం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు, 35మంది ఉపాధ్యక్షులు, 75మంది ప్రధాన కార్యదర్శులు, 10మంది సీనియర్లతో సలహా కమిటీ, 20 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ. మొత్తంగా టీపీసీసీ జంబో కార్యవర్గం ఏర్పడనుంది. ఇందులో 70 శాతం పదవులు SC, ST, BCలకే దక్కనున్నాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి!