చాంద్రాయణగుట్ట: విషాదంగా మారిన చిన్న వివాదం

60చూసినవారు
పాతబస్తీలో చిన్న వివాదం విషాదంగా మారింది. జాకీర్ ఖాన్ హఫీజ్(62) బాబానగర్లోని సీ బ్లాకులో కిరణ దుకాణాన్ని నడుపుతున్నాడు. పక్కనే ఉన్న పాన్ షాప్ కు వచ్చిన యువకులు షాపు ముందు కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. ఈ క్రమంలో తలెత్తిన ఘర్షణలో జాకీర్ పై యువకులు దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. కంచన్ బాగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నిన్న అర్థరాత్రి జరగగా నేడు సీసీ కెమెరా దృశ్యాలు బయటకు వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్