మొహర్రం సందర్భంగా పాతబస్తీ డబిర్ పురా లోని బీబీకా అలాంను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. శతాబ్దాలుగా ఆనవాయితీగా జరుగుతున్న బీబీకా అలాం ఊరేగింపును తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏనుగును తీసుకొచ్చినట్టు తెలిపారు.