ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ మెయిన్ రోడ్డు శనివారం రోజు ఉదయం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారు పాత రోడ్డును తవ్వేసి కొత్తగా కాంక్రీట్ రోడ్డు నిర్మాణం చేశారు. అటువైపు వెళ్ళే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు అప్పుడే వేసిన రోడ్డుపై నుంచి అలాగే నడుస్తున్నారు. దాంతో కొత్త కాంక్రీట్ రోడ్డుపై కాళ్ల అచ్చులు పడుతున్నాయి. గుత్తేదారు వారిని ఆపలేక విస్సుకుంటున్నారు.