సులేమాన్ నగర్ లో విద్యుత్ సరఫరా సమస్యలు లేకుండా చూస్తున్నామని ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మాత్ బేగ్ అన్నారు. గురువారం విద్యుత్ శాఖా అధికారులతో కలిసి డివిజన్ లో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకురాగా, నూతన విద్యుత్ స్థంబాలు, నూతన ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఎమ్మెల్సీ ఆదేశించారు.