హైదరాబాద్ లో మరో 3 గంటలు వర్షం

58చూసినవారు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో 3 గంటలు మోస్తరు నుంచి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెల్లవారుజామున సిటీలో వాన దంచికొట్టింది. ఉదయం మీర్పేట, బడంగ్పేట, బాలాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. వర్ష సూచన పట్ల అప్రమత్తంగా ఉండాలని, తడిగా ఉన్న రోడ్ల మీద వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్