ఈతకు వెళ్లిన ఇద్దరు హైదరాబాదీలు నిజామాబాద్ జిల్లాలో మృతి చెందారు. చాంద్రాయణగుట్ట కు చెందిన సయ్యద్ వసీక్(32), సయ్యద్ యాకుబ్ (32) ఇటీవల నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలానికి వెళ్లారు. ఆదివారం సరదాగా అక్కడ మంచిప్ప చెరువులో ఈత కోసం వెళ్లి నీటిలో మునిగి చనిపోయారు. విషయం తెలుసుకున్న మోపాల్ పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. పంచనామా నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.