ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలో శ్రీ శివాలయం ప్రాంగణంలో గల యాగశాలలో 11 జూన్ 2025 బుధవారం ఉదయం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించనున్నట్లు శ్రీ శివాలయం ఆలయ ఇంచార్జి పార్థసారధి మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి గల భక్తులు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందగలరన్నారు.