ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలో శ్రీ శివాలయం ప్రాంగణములో గల శ్రీ గణేశ ఆలయంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సంకటహర చతుర్ధి సందర్భంగా గణపతి హోమం, శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నట్లు శ్రీ శివాలయం ఆలయ ఇంచార్జి అధికారి పార్థసారధి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.