ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ, శ్రీ శివాలయం ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం, ఆర్టిస్టు శ్రీగిరి శ్రీధర్ గురుస్వామి అయ్యప్ప మాలదారుల బృందం, అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక అభిషేకం చేసి, స్వామి వారికి పూలమాలలు వేసి చక్కగా అలంకరించి, 18 మెట్లపై మరియు అయ్యప్ప స్వామి దగ్గర దీపారాధన చేసి, భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. తదుపరి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.