బోనాలు జూన్ 26న ప్రారంభమై.. జూలై 24న ముగింపు

76చూసినవారు
ఆషాఢ మాస బోనాల తేదీలను మంగళవారం ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 26న గోల్కొండ బోనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, 13న ఉజ్జయిని మహంకాళి జాతర, 14న రంగం, 20న అక్కన్న మాదన్న, లాల్ దర్వాజ బోనాలు జరగనున్నాయి. జూలై 24న బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. నెల రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను ఊర్లల నుండి వచ్చిన భక్తులతో హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్