ప్రత్యేక ప్రార్థనల కోసం డివిజన్ వ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని షాలిబండ డివిజన్ కార్పొరేటర్ ముస్తఫా అలీ ముజఫర్ అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని పూల్ బాగ్ లోని ముస్లీం గ్రేవియార్డులను కార్పొరేటర్ సుదర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా చెట్ల కొమ్మలను క్లియర్ చేస్తున్నామని పెయింటింగ్ పనులను చేపడుతున్నామని తెలిపారు. అలాగే తాత్కాలిక వీధిలైట్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.