మొహర్రం సందర్భంగా ప్రత్యేక వాహనంలో గజరాజును శనివారం నగరానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం బీబీకా అలాం వద్ద పేద తీరుతోంది. రేపు గజరాజుపై భారీ ఊరేగింపు జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హాసన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వేలాది మంది పాతబస్తీకి రానున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.