ఫలక్ నుమా లోని శ్రీ పంచలింగాల ఆలయ భూమిని కబ్జాకొరుల నుంచి కాపాడాలని బీజేపీ నాయకురాలు మాధవీలత డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన ఆమె 3. 15 ఎకరాల ఆలయ భూమిలో అక్రమంగా ఇళ్ళు కట్టారని ఆరోపించారు. 15 ఏళ్లుగా వానరసేన పోరాటం చేస్తోందని, కానీ అధికారులు కబ్జాదారులకు మద్దతు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. భూమిని ఆలయానికి అప్పగించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు.