చార్మినార్ నియోజకవర్గ పరిధి శాలిబండ దివిజన్లో గురువారం దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంఐఎం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేడుకలకు చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జూల్చికర్ అలీ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతం జనగణమన ఆలపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ముస్తఫా అలీ, తదితరులు పాల్గొన్నారు.