మొహరం పండుగకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రేహ్మత్ బెగ్ ఆదేశించారు. శనివారం ఎంఐఎం కార్యాలయంలో మొహరం పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్సీ సమావేశమయ్యారు. పండుగ సమయంలో ఎటువంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. అలాగే మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్పొరేటర్లతో సమన్వయం అవుతూ ఏర్పాట్లు చేయాలన్నారు.