బీబీ కా ఆలం ఊరేగింపు సందర్భంగా ఆదివారం చార్మినార్ వద్ద హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు సీపీ విక్రమ్ సింగ్ మన్, సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్ర తదితర అధికారులు ఆలం కి 'ధట్టి' సమర్పించారు. అనంతరం ఏనుగు ఆశీర్వాదం కూడా పొందారు. వేలాది మంది భక్తులతో చార్మినార్ పరిసరాలు కిటకిటలాడగా, భద్రతా చర్యలలో భాగంగా పోలీసులు భారీగా మోహరించారు.