ఇంటెలిజెన్స్ అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పన్నిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కు చెందిన సమీర్‌ను పేలుళ్లకు పాల్పడేలా ఐసిస్ మాడ్యుల్ ఆదేశాలిచ్చింది. వారు విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశారు. అయితే ఏపీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారుల సంయుక్త ఆపరేషన్‌లో నిందితులిద్దరూ పట్టుబడ్డారు.