మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది కుక్కల వేటలో నిమగ్నమై చెమటోడ్చి మరి కుక్కలను పట్టుకుంటున్నారు. దీనిపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు చిన్నారులను విధి కుక్కలు చిదిమేస్తుంటే ఏం చేయలేని మీరు ఇప్పుడేమో అందాల భామాల కోసం పని చేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. గత సంవత్సర కాలంలో కుక్క కాటుకు 20కి పైగా మంది మృతి చెందినట్లు నగర ప్రజలు గుర్తు చేస్తున్నారు.