హైదరాబాద్: అగ్నిప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌ ఆరా

82చూసినవారు
హైదరాబాద్: అగ్నిప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌ ఆరా
హైదరాబాద్ చార్మినార్‌ పరిధిలోని గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 8 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఘటనాస్థలానికి వెళ్లాలని ఆదేశించారు. మరికాసేపట్లో పొన్నం అక్కడికి వెళ్లనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్